Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తూఛ్... అలా అనలేదు.. సీఎం కేసీఆర్, ఉద్యోగుల కృషి వల్లే కరోనా మాయం.. శ్రీనివాస రావు

Advertiesment
Jesus Eradicated Covid
, గురువారం, 22 డిశెంబరు 2022 (15:47 IST)
Srinivasa Rao
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పల్టీకొట్టారు. బుధవారం రాత్రి కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని.. కరోనా వైరస్ మహమ్మారి నుంచి భారత్‌‍ను ఏసు ప్రభువు రక్షించారనీ, ఆయన దయ, కృప వల్లే ఈ వైరస్ నుంచి విముక్తి పొందినట్టు వ్యాఖ్యానించారు.

పైగా, మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని చెప్పారు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవులు లేకపోతే ప్రపంచ దేశాల్లో భారత్ మనుగడ సాగించేది కాదని అన్నారు. మనం చేసిన సేవలు వల్ల కరోనా తగ్గలేదని, కేవలం ఏసు ప్రభువు కృప వల్లే కరోనా తగ్గిందని అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ఆయన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆరోపించారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి వివాదాన్ని సృష్టించాయని అసహనం వ్యక్తం చేశఆరు. దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవు, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంపూర్ణ సహకారం, ఇతర శాఖల మద్దతుతోనే కరోనాను నియంత్రించగలిగామని వివరణ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాక్ చెఫ్ కన్నుమూత