Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైల్లో నాకు చుక్కలు చూపించారు... ప్రజలు మద్దతిస్తే కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తా: జగ్గారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలను పాలించాలని కేసీఆర్‌కు అధికారం

Advertiesment
Jagga Reddy
, మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:56 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలను పాలించాలని కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే...  ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.
 
ఏ తప్పు చేయని తనపై ప్రభుత్వం సుమోటోగా కేసు పెట్టిందని వాపోయారు. 2004 కేసులో తన పేరు లేదని గుర్తు చేశారు.. తప్పు చేశానా.. లేదా అని కోర్టు తేలుస్తుందన్నారు. రాహుల్ సభ తర్వాత తనను ప్రభుత్వం టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీపై కూడా తప్పుడు కేసులు పెడితే అది మంచి సంప్రదాయం అవుతుందా అని ప్రశ్నించారు.
 
13 రోజులు తనకు జైల్లో చుక్కలు చూపెట్టారని వాపోయారు. పోలీసులు కూడా పక్షపాతం వహించకుండా న్యాయబద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఏ విషమైనా ఎంతో ధైర్యంగా మాట్లాడే వాడినని అటువంటిది నన్ను భయభ్రాంతులకు గురిచేశారని వాపోయారు. ప్రజలు ఆదరించి ఆశీస్సులు ఇస్తే కేసీఆర్‌కి చుక్కలు చూపిస్తానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అయితే, ఆస్తులు అమ్మండి : కోర్టు ఆదేశం