Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రాష్ట్రాన్ని ఏ అమ్మో ఇవ్వలేదు.. మేం పోరాడి తెచ్చుకున్నాం : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఏ అమ్మో ఇవ్వలేదని, ప్రజలతో కలిసి తాము పోరాడి సాధించుకున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విభజన తర్వాత 30 నెలల్లో తెలంగాణ రాష్ట్రం అనేక అడ్డంకుల్ని తట్టు

Advertiesment
తెలంగాణ రాష్ట్రాన్ని ఏ అమ్మో ఇవ్వలేదు.. మేం పోరాడి తెచ్చుకున్నాం : కేటీఆర్
, మంగళవారం, 3 జనవరి 2017 (06:40 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఏ అమ్మో ఇవ్వలేదని, ప్రజలతో కలిసి తాము పోరాడి సాధించుకున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విభజన తర్వాత 30 నెలల్లో తెలంగాణ రాష్ట్రం అనేక అడ్డంకుల్ని తట్టుకొని నిలబడిందని చెప్పారు. 
 
రవీంద్రభారతిలోని టీఎన్‌జీవో 2017 డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిపాలనలో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం, పరిపాలనలో టీఎన్జీవోల పాత్ర అమోఘమని కొనియాడారు. 
 
నాలుగో తరగతి ఉద్యోగులు ఏపీలో ఉన్నారనీ, వారిని స్వరాష్ట్రానికి తీసుకొస్తామన్నారు. ప్రతి సోమవారం 4 లక్షల మంది ఉద్యోగులు చేనేత వస్త్రాలు వేసుకోవాలని కోరారు. తాను కూడా చేనేత వస్త్రాలు ధరిస్తానని, సీఎస్‌ను కూడా వేసుకోవాలని కోరినట్టు చెప్పారు. చేనేత వస్త్రాలను ధరించడం వల్ల నేతన్నలకు సాయం చేసినవాళ్లమవుతామని ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరమ్మాయిలతో ఎంజాయ్ చేసి.. జైలు ఊచలు లెక్కిస్తున్న ఎంటెక్ విద్యార్థి