Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు

తెలంగాణాలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు
, ఆదివారం, 24 అక్టోబరు 2021 (12:45 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4,59,228 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే, పరీక్షా హాలుకు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. 
 
సోమవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకుగానూ కోవిడ్ నిబంధనలను అనుసరించి, 1,768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ విధుల్లో కోవిడ్ వాక్సిన్ తీసుకున్న వారినే నియమించారు. 
 
ప్రతీ పరీక్ష కేంద్రంలో ఒకటి లేదా రెండు ఐసోలేషన్ రూంలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు కరోన భారిన పడితే వారికి తరవాత పరీక్ష రాసే అవకాశం ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారు. 
 
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా పరీక్ష రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి కోసం మానసిక నిపుణులను ఏర్పాటు చేశామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ….కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటి ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ నేత పట్టాభి మరోసారి అరెస్టు