తెలంగాణలో రాబోయే ఐదు రోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం వుందని అధికారులు తెలిపారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	కొమురంభీం, నిర్మల్, వరంగల్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు. ఈ నెల 12న (ఆదివారం) ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 
	 
	ఈ నెల 13 సోమవారం హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.