హైదరాబాద్ నగరంలో అనేక పబ్బులు ఉన్నాయి. ఈ పబ్బుల్లో అనేక అసాంఘిక కార్యక్రమాలు యధేచ్చగా సాగుతున్నాయి. దీనికి తాజా ఉదారణే జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన. దీంతో హైదరాబాద్ నగరంలోని కబ్బుల యజమానుల్లో మార్పు వచ్చింది. ఇక నుంచి పబ్బుల్లో కేవలం 21 యేళ్లు నిండినవారికి మాత్రమే అనుమతి ఇస్తామని ప్రకటించారు.
నగరంలోని ఓ పబ్ నుంచి ఓ మైనర్ బాలికను కారులో తీసుకెళ్లిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పైగా, ఈ కేసులో పలువురు రాజకీయ నేతల పిల్లలు నిందితులుగా ఉన్నారు. దీంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పరిణామాలతో పబ్‌ల నిర్వాహకులు మరిన్ని కఠన చర్యలు తీసుకున్నారు. మేజర్ అయిన వారికి పబ్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని, అందుకే 21 యేళ్లు అంటూ పబ్‌ల ముందు ప్రకటన బోర్డులు పెట్టారు. 21 యేళ్లలోపు వారు ఒక్కరున్నప్పటికీ గ్రూపులు లేదా కుటుంబ సభ్యులు జరుపుకునే పార్టీలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.