తనను నిశ్చితార్థం చేసుకొని మోసం చేశాడని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్‌పై ఓ యువతి కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా పెద్ద మందడి గ్రామానికి చెందిన శశికుమార్ .. కానిస్టేబుల్. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
అయితే అతనికి 2019 నవంబరు నెలలో హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. అనంతరం రూ.5 లక్షల కట్నం కోసం ఒప్పందం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇస్తేనే పెండ్లి చేసుకుంటానని శశికుమార్.
దీంతో బాధితురాలు.. హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీసు ఠాణా, నాగర్ కర్నూల్ పోలీసు ఠాణాలలో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తోంది.
తాజాగా శశికుమార్ పై బాధితురాలు ఫిర్యాదు మేరకు కుల్సుంపురా పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ పి.శంకర్ పర్యవేక్షణలో ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.