ప్రియుడితో కలిసి వున్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఎక్కడ?
ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్
ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే భార్య ప్రియుడు భర్తపై దాడి చేసి పారిపోయాడు. ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఎల్బీ నగర్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. అయితే వారింటికి సమీపంలోనే ఉంటున్న వ్యక్తితో ప్రైవేట్ ఉద్యోగి భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త మందలించినా.. ఫలితం లేకపోయింది. తన భర్త తనను అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని భార్య సరూర్ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే దీనికి ప్రియుడే కారణమని భర్త ఆరోపించాడు.
ఈ విషయమై భార్య, భర్తలకు మహిళా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. దీంతో ఎల్బీ నగర్ నుండి వారు ఇల్లును మార్చారు. అయినా వారిద్దరి ప్రవర్తనలో మార్పురాలేదు. కానీ ప్రియుడితో భార్య కలిసి ఉండగా వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నాడు.