హైదరాబాద్‌లో కొత్త ఫ్లై ఓవర్ రానుంది. ఇందిరాపార్క్ నుంచి వీఎస్‌టీ వరకు నిర్మిస్తున్న ఈ స్టీల్ ఫ్లైఓవర్‌ను ఆగస్టు 15న ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఈ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.
దీంతో నగరంలో నడిబొడ్డున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్ రోడ్లలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరనున్నాయి.
2.25 కిలోమీటర్ల ఈ ఫ్లైఓవర్‌ను నాలుగు లైన్లతో నిర్మించారు. దీని నిర్మాణం కోసం 13 వేల టన్నుల స్టీల్‌ను ఉపయోగించారు. ఫ్లై ఓవర్ ప్రారంభానికి సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పుకొచ్చారు.