Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోటల్‌లో మత్తు మందిచ్చి యువతిపై రేప్... ఉచ్చులో దింపిన లేడీ ఫోన్ స్విచాఫ్

హైదరాబాద్‌కు వచ్చిన కోల్‌కతా యువతి పట్ల నలుగురు దారుణంగా ప్రవర్తించారు. మాయమాటలతో నమ్మించి.. పక్కా ప్లాన్‌ ప్రకారం గదిలో బంధించి మరీ అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు ప్రీత్‌ షెర్గిల్‌(39)ను పోలీసులు అరెస్టు చేయడంతో రెండున్నర నెలల క్రితం జరిగిన ఈ ఘో

హోటల్‌లో మత్తు మందిచ్చి యువతిపై రేప్... ఉచ్చులో దింపిన లేడీ ఫోన్ స్విచాఫ్
, మంగళవారం, 2 మే 2017 (13:39 IST)
హైదరాబాద్‌కు వచ్చిన కోల్‌కతా యువతి పట్ల నలుగురు దారుణంగా ప్రవర్తించారు. మాయమాటలతో నమ్మించి.. పక్కా ప్లాన్‌ ప్రకారం గదిలో బంధించి మరీ అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు ప్రీత్‌ షెర్గిల్‌(39)ను పోలీసులు అరెస్టు చేయడంతో రెండున్నర నెలల క్రితం జరిగిన ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో పర్యటించేందుకుగాను కోల్‌కతాకు చెందిన, బీకాం చదువుతున్న యువతి(19) ఫిబ్రవరి 14న శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చింది. తాను బసచేయబోయే హోటల్‌కు షేరింగ్‌ క్యాబ్‌లో బయల్దేరింది. టూర్‌కు వచ్చినట్లు తెలుసుకున్న తోటి ప్రయాణీకురాలు పింకీరాయ్ ఆమెతో మాట కలిపింది. తెలిసిన స్నేహితుడికి కారు ఉందని, అందులో ఇద్దరం నగర పర్యటనకు వెళ్దామంటూ నమ్మించింది. 
 
ఇలా ఫిబ్రవరి 15న ఇద్దరూ అమీర్‌పేటలోని హోటల్‌లో కలుసుకున్నారు. ఆపై హోటల్‌కు తీసుకెళ్లి  స్నేహితుడికి పరిచయం చేసింది. ఆ యువకుడు పక్కా ప్లాన్ ప్రకారం అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. 
 
మత్తు మందులోనే యువతి ఇంట్లోంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా.. బెదిరించి మరీ అత్యాచారం చేశాడు. ఆపై మరో ముగ్గురు కోల్‌కతా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తులో మరికొంత సమాచారం కనుగొన్నారు. ఆ రోజున కారులో వీళ్లిద్దరినీ హోటల్‌కు తెచ్చిన డ్రైవరును విచారించగా అతడు నీళ్లు నమిలాడు. దీంతో అతడిని వదిలి ఆ రోజు బాధిత యువతితో పాటు ప్రయాణించిన పింకీ రాయ్ అనే మహిళపై ఫోకస్ పెట్టారు. ఆమె ప్రీత్‌తో మాట్లాడిన రికార్డులను పరిశీలించగా, బాధితురాలిని తనే నమ్మించి ఇక్కడికి తీసుకున్నట్లు తేలింది. ఆ ఫోన్ ఆధారంగా ఆమెకు కాల్ చేస్తే ఫోన్ స్విచాఫ్ అయ్యింది. ఐతే లొకేషన్ ఆధారంగా ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రిగ్గర్ నొక్కగానే బిన్ లాడెన్‌ తల పుచ్చకాయలా పేలిపోయింది... ‘రహస్య దాడి’పై నేవీ మాజీ సీల్‌ రాబర్ట్‌ ఓనీల్