Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజల సెంటిమెంట్ కోసం కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్.. రూ.50 లక్షల సుపారీకి డీల్

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ నియోజకవర్గ ప్రజల సానుభూతి కోసం పక్కా ప్రణాళికతోనే తనపై కాల్పులు జరిపించుకున్నట్టు హైదరాబాద్ నగర పోలీసులు తేల్చారు.

ప్రజల సెంటిమెంట్ కోసం కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్.. రూ.50 లక్షల సుపారీకి డీల్
, బుధవారం, 2 ఆగస్టు 2017 (17:00 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ నియోజకవర్గ ప్రజల సానుభూతి కోసం పక్కా ప్రణాళికతోనే తనపై కాల్పులు జరిపించుకున్నట్టు హైదరాబాద్ నగర పోలీసులు తేల్చారు. ఇందుకోసం రూ.50 లక్షల సుపారీ చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దశల వారీగా రూ.9 లక్షల మేరకు చెల్లించినట్టు విచారణలో తేలింది. దీంతో విక్రమ్ గౌడ్‌ను అరెస్టు చేయనున్నట్టు హైదరాబాద్ నగర సీపీ మహేందర్ రెడ్డి బుధవారం వెల్లడించారు. 
 
ఈ కాల్పులు ఘటనపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ విక్రమ్‌ గౌడ్ పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పులు జరిపించుకున్నారని, ఈ కాల్పుల ఘటనలో 8 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కేసులో మొత్తం 9 మందిని నేరస్థులు, అనుమానితులుగా గుర్తించామన్నారు. ఇందులో విక్రమ్‌ గౌడ్‌ను మొదటి నిందితుడని తెలిపారు. ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. 
 
జులై 28న తెల్లవారుజామున కాల్పుల ఘటన జరుకగా, ఈ కాల్పులు పెను సంచలనం సృష్టించాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు కాల్పుల ఘటన వెనుక వున్న అసలు నిజాన్ని బహిర్గతం చేశారు. పైగా, నిందితుల నుంచి రూ.5.3 లక్షలు, తుపాకీ, కారు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్‌ గౌడ్ 4 నెలల క్రితమే ఈ ఘటనకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. గాయపర్చుకుంటే తన నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి వస్తుందనీ, తనతో ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తులపై ఒత్తిడి వస్తుందనుకుని ఈ పని చేశాడని సీపీ వివరించారు. 
 
ఇందుకోసం మొత్తం రూ.50 లక్షలకు డీల్ కుదుర్చుకోగా, ఎవరెవరు ఏమేమి చేయాలన్నది కూడా విక్రమ్‌గౌడ్ ప్లాన్ చేసినట్లు సీపీ వెల్లడించారు. భార్య కానీ, వాచ్‌మెన్ కానీ చూస్తే ఒక రౌండ్ కాల్పులు జరపాలని విక్రమ్ గౌడ్ వారికి చెప్పినట్లు తెలిపారు. అపోలోకి దగ్గరలో ఉన్న తేజ్ నివాస్ గెస్ట్‌హౌజ్‌లో నిందితుల కోసం ఒక రూం కూడా బుక్ చేసినట్లు చెప్పారు. విక్రమ్‌ గౌడ్ పేరుమీదే రూం కూడా బుక్ చేసినట్లు ఉందని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు వర్జినా? లేక బ్యాచిలరా? మీకెంతమంది భార్యలు...