Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లైన నాలుగేళ్లకే భార్యపై మోజు తీరింది.. రెండో పెళ్లికి భర్త సిద్ధం.. ఆమె..?

Advertiesment
పెళ్లైన నాలుగేళ్లకే భార్యపై మోజు తీరింది.. రెండో పెళ్లికి భర్త సిద్ధం.. ఆమె..?
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:25 IST)
స్మార్ట్ ఫోన్ల యుగం.. ఇంటర్నెట్ యుగంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా తన భర్త రెండో పెళ్లికి చేసుకుంటున్నాడనే మనస్తాపంతో ఓ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా భగోపురం మండలం రావివలస గ్రామానికి చెందిన వెంపాల రాముల బంగారికి (అలియాస్ శ్యామ్) దల్లిపేట గ్రామానికి చెందిన రమాదేవితో(21) నాలుగేళ్ల క్రితం వివాహమయ్యింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి కౌశిక (3), వాయిత్‌ (9 నెలలు) ఇద్దరు పిల్లలున్నారు. 
 
పెళ్లి అయిన రెండేళ్ల తరువాత వీరి కుటుంబంలో చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి. భర్తతోపాటు అత్త,మామలు తరచూ రమాదేవిని వేధించడం మొదలుపెట్టారు. తన కుమారుడికి రెండో వివాహం చేస్తామని… అత్త అప్పల నరసమ్మ, మామ రమణ కలిసి , తన కుమారుడికి విడాకులు ఇవ్వాలని… కాగితంపై సంతకం పెట్టమని 15 రోజుల క్రితం రమాదేవిపై ఒత్తిడి తెచ్చారు. 
 
దీంతో జీవితంపై విరక్తి చెందిన రమాదేవి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి దల్లి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన నాలుగేళ్లకే భార్యకు దూరమవ్వాలని.. రెండో పెళ్లి చేసుకునేందుకు నిందితుడు సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కోవిషీల్డ్ ధర ఖరారు : ప్రభుత్వ - ప్రైవేటుకు వేర్వేరు ధరలు..