Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త... నీ భార్యను అలా చేస్తామనే సరికి కానిస్టేబుల్‌ ఆత్మహత్య..?

Online Fraud
, బుధవారం, 20 జులై 2022 (13:25 IST)
ఆన్‌లైన్ లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా వుండాలి. లేకుంటే సర్వం కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌ రుణ యాప్‌ల కారణంగా డబ్బులు ఇచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అవసరం కోసం ఆన్‌లైన్‌ రుణ యాప్‌లో చేసిన రూ.6000 అప్పు ప్రాణాన్ని బలి తీసుకుంది. అది కూడా ఓ అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ పాలిట యమపాశమైంది.

సొమ్ము సకాలంలో చెల్లించలేదనే నెపంతో.. నీ భార్య ఫోన్‌ నెంబర్‌ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే రోజుకు రూ.1000 వస్తాయంటూ ఆ యాప్‌కు చెందిన వ్యక్తులు చేసిన వేధింపులు అతని ఆత్మహత్యకు కారణమయ్యాయి. 
 
అవమానం భారంతో రైలు కింద పడి ప్రాణం తీసుకునేలా చేశాయి. దీంతో ఆన్‌లైన్‌ రుణయాప్‌ వేధింపులకు మరో వ్యక్తి బలవ్వగా.. జల్‌పల్లి-శాస్త్రిపురం మార్గంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
జల్‌పల్లికి చెందిన యంజాల సుధాకర్‌(33) చందులాల్‌ బారదరి ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
ఆయనకు భార్య మాధవితోపాటు 18 నెలల వయస్సున్న కూతురు ఉన్నారు. అయితే, గోల్డెన్‌ రూపీ అనే రుణయాప్‌ నుంచి తీసుకున్న రూ.6 వేలు రుణాన్ని సుధాకర్‌ సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆ యాప్‌ ఏజెంట్ల నుంచి వేధింపులకు గురయ్యారు. 
 
ఎన్నిసార్లు బాకీ సొమ్ము చెల్లించినా ఇంకా బకాయి ఉన్నావంటూ వేధించేవారు. అసభ్య పదజాలంతో ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టి మానసికంగా హింసించేవారు. నీ భార్య నంబర్‌ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే.. ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.1000 వస్తాయని సందేశాలు పంపేవారు.

అంతేకాక, సుధాకర్‌ ఓ మోసగాడు అంటూ అతని కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న పలువురికి మెసేజ్‌లు పెట్టారు. వీటన్నింటితో మనస్తాపం చెందిన సుధాకర్‌ ఇటీవల సన్నిహతుల వద్ద తన కష్టం చెప్పుకున్నారు. కానీ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శివరాంపల్లి - శాస్త్రీపురం మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంక కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే