Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో నిరుద్యోగులకు శుభవార్త ... 50 వేల ఉద్యోగాలకు క్లియరెన్స్

Advertiesment
తెలంగాణాలో నిరుద్యోగులకు శుభవార్త ... 50 వేల ఉద్యోగాలకు క్లియరెన్స్
, గురువారం, 1 జులై 2021 (16:00 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థ కింద రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ వచ్చింది. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల ప్రకారం జోనల్ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో 50,000 ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రావడమే మిగిలింది.
 
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జోనల్‌ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీకి ఇబ్బంది తలెత్తింది. ముఖ్యంగా గ్రూప్‌-1, గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీ జరుగలేదు. పాతజోనల్‌ విధానంలోనే ఒకసారి గ్రూప్‌-2, గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ జరిగింది. 2018లో రాష్ట్రపతి ఆమోదించిన ఉత్తర్వుల ప్రకారం గ్రూప్‌-1 ఉద్యోగాలు కూడా మల్టీజోనల్‌లోకి వచ్చాయి. 
 
అయితే ఆ ఉత్తర్వు ల్లో 31 జిల్లాలనే చేర్చారు. కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలతోపాటు, వికారాబాద్‌ ప్రజలు త మ జిల్లాను జోగులాంబ నుంచి చార్మినార్‌ జోన్‌లో కలుపాలని విన్నవించడంతో ప్రతిపాదనలను మార్చి మరోసారి రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వచ్చింది. దీంతో ఉపాధ్యాయ భర్తీలకు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వివిధ కారణాలతో ఆగిపోయాయి. 
 
తాజాగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులతో తిరిగి గ్రూప్‌-1తోపాటు అన్ని గ్రూప్‌ ఉద్యోగాలు, ఉపాధ్యాయ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు అధికారులు శాఖలవారీగా సర్వీస్‌ రూల్స్‌ రూపొందించుకొని ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఏర్పడింది.
 
మల్టీ జోన్ -1 పరిధిలో
కాళేశ్వరం జోన్‌ (1వ జోన్): కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు. 
బాసర జోన్‌ (2వ జోన్): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జగిత్యాల జిల్లాలు.
రాజన్న సిరిసిల్ల జోన్‌(3వ జోన్: కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు.
భద్రాద్రి కొత్తగూడెంజోన్ (4వ జోన్): భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు. 
 
మల్టీజోన్ -2 పరిధిలో
యాదాద్రి జోన్ (5వ జోన్)లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు. 
చార్మినార్‌ జోన్ (6వ జోన్)లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు. 
జోగుళాంబ జోన్ (7వ జోన్)లో మహబూబ్ నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలను చేర్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో మారు ‘అన్‌లాక్‌ బిగ్గెస్ట్‌ సేవింగ్స్‌’తో ముందుకు వచ్చిన స్పెన్సర్‌