Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ హోటల్స్‌పై ఆగని జీహెచ్ఎంసీ దాడులు.. కుళ్లిన చికెన్, ఈగలు వాలిన ఆహార పదార్థాలతో?

హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు అంటేనే ప్రస్తుతం జనం జడుసుకుంటున్నారు. మటన్ బిర్యానీలు, చికెన్ పకోడీలు వంటి ఇతరత్రా మాంసాహారంలో కుళ్లిన మాంసాన్ని వాడుతున్నారని ఇప్పటకే పలు ఫిర

Advertiesment
GHMC
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (16:17 IST)
హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు అంటేనే ప్రస్తుతం జనం జడుసుకుంటున్నారు. మటన్ బిర్యానీలు, చికెన్ పకోడీలు వంటి ఇతరత్రా మాంసాహారంలో కుళ్లిన మాంసాన్ని వాడుతున్నారని ఇప్పటకే పలు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని హోటల్స్ సీజ్ కూడా అయ్యాయి. అయితే తాజాగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు నగరంలోని హోటల్స్‌పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా ఎల్బీనగర్‌లోని ది న్యూ గ్రీన్ బావర్చి హోటల్‌ను అధికారులు తనిఖీ చేశారు. ఈ హోటల్‌పై దాడిలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటళ్లో భుజించే ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా.. కుళ్లి కంపు కొడుతున్న మాంసం, ఆహార పదార్థాలతో బిర్యానీ వండుతున్నట్లుగా గుర్తించారు. పాడైపోయిన చికెన్.. ఈగలు వాలిన ఆహారపదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. కనీస నిబంధనలు పాటించని ఆ హోటల్‌పై రూ.10వేల జరిమానా విధించి హోటల్‌పై కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో మరో ఉచిత ఆఫర్... పైసా చెల్లించకుండా...