Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ సాయిల్‌ దినోత్సవం 2020 పురస్కరించుకుని జియోలైఫ్‌ ప్రచారం

ప్రపంచ సాయిల్‌ దినోత్సవం 2020 పురస్కరించుకుని జియోలైఫ్‌ ప్రచారం
, సోమవారం, 7 డిశెంబరు 2020 (13:44 IST)
భూసారం గతం కన్నా వేగంగా ఇప్పుడు క్షీణించడానికి సేంద్రీయ కార్బన్‌లు తక్కువ స్థాయిలో ఉండటం కారణమన్నది చాలామందికి తెలిసిన అంశమే. ఈ అంశాల పట్ల రైతులు, ప్రకృతి ప్రేమికులకు అవగాహన కల్పిస్తూ జియో లైఫ్‌ పలు కార్యక్రమాలను నిర్వహించింది. ప్రపంచ సాయిల్‌ దినోత్సవం సందర్భంగా నేలను సజీవంగా ఉంచడమనే లక్ష్యానికి అనుగుణంగా జియోలైఫ్‌ ఈ  కార్యక్రమాలను చేపట్టింది.
 
ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా తెలంగాణా రాష్ట్రాలలో చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా భూసారం మెరుగుపరచాల్సిన ఆవశక్యకత గురించి తెలియజేశారు. జియో లైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ లహోటీ ఈ కార్యక్రమాన్ని వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో నిర్వహించగా, రంగారెడ్డి జిల్లా కీసర జోన్‌లో ఉన్న కూకట్‌పల్లిలో సంస్థ ఫైనాన్షియల్‌ అడ్మిన్‌స్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ లహోటీ, నల్గొండ జిల్లాలో సీఈవో శ్రీమతి జయలక్ష్మి బొప్పనతో పాటుగా మరో 50కు పైగా ప్రాంతాలలో జియోలైఫ్‌ సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
webdunia
ప్రస్తుతం 157.35 మిలియన్‌ హెక్టార్ల భూమి సాగులో ఉన్నప్పటికీ నేలలో సేంద్రీయ కార్బన్‌లు మాత్రం 1% లోపుగానే ఉన్నాయి. 1980లలో అది 20% వరకూ ఉండేది. భూసారం రోజురోజుకీ క్షీణించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ప్రభావవంతమైన పోషకాహార నిర్వహణ వ్యవస్ధ సహాయంతో దీనిని మనం వృద్ధి చేసుకోవచ్చని వినోద్‌ లహోటీ అన్నారు.
 
ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపుతూ జియోలైఫ్‌ అగ్రిటెక్‌ ఇండియా ఇప్పుడు విగర్‌ రాజా, బ్యాక్టోగ్యాంగ్‌ లాంటి ప్రత్యేకమైన ఉత్పత్తులను విడుదల చేసిందన్నారు. జియోలైఫ్‌ యొక్క ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి విగర్‌ రాజా, భూమిలోని సూక్ష్మజీవులను ఉత్తేజపరిచి జీవవైవిధ్యం మెరుగుపరచడంతో పాటుగా జీవ ఒత్తిడి సమస్యలను తగ్గించి, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపరచడం చేస్తుందన్నారు. 
 
ఇక బ్యాక్టోగ్యాంగ్‌ గతంలో ఎన్నడూ వినని సూత్రీకరణతో చేయబడిందంటూ భూమికి అవసరమైన బ్యాక్టీరియాను తిరిగి అందించడమే లక్ష్యంగా దీనిని తీర్చిదిద్దామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#AmbatiRambabuకు రెండోసారి కరోనా పాజిటివ్.. మహమ్మారి రూటు మార్చేసిందా?