Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో దారుణం.. రూ.పది కోసం హత్య చేశారా..?

హైదరాబాద్‌లో దారుణం.. రూ.పది కోసం హత్య చేశారా..?
, శుక్రవారం, 8 జనవరి 2021 (08:12 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పది రూపాయల కోసం దుండగులు ఓ పండ్ల వ్యాపారిని అతి దారుణంగా హత్య చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ హత్యను పోలీసులు చేధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షకీబ్ అలీ ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. కూకట్‌పల్లి తులసీనగర్ పరిధిలో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం ప్రగతి నగర్ రోడ్డులో తోపుడి బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు.
 
అయితే జనవరి 1వ తేదీన నసీం అనే వ్యక్తి షకీబ్‌వలీ వద్దకు వచ్చి కిలో ద్రాక్ష పండ్లు కొనుగోలు చేశాడు. కిలో ద్రాక్షకు రూ.30 అని చెప్పగా.. నసీం 20 రూపాయలు మాత్రమే ఇచ్చి షకీబ్‌అలీతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
 
దీంతో నసీం తన ఐదుగురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. అనంతరం వారు షకీబ్అలీ కడుపులో ఇనుపస్టాండ్‌తో బలంగా కొట్టారు. గాయాలతో ఉన్న అతడిని అక్కడే వదిలేసి పారిపోయారు. 
 
ఇక, షకీబ్‌అలీని ఆస్పత్రిలో చేర్పించగా.. జనవరి 3వ తేదీన చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిజెపి నేతలపై దాడులు చేయించాల్సిన అవసరం మాకు లేదు: హోంమంత్రి