Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెహ్రూ పార్కులో ఆడ ఏనుగు "గజరాణి" మృతి...

నెహ్రూ పార్కులో ఆడ ఏనుగు
, గురువారం, 10 జూన్ 2021 (15:45 IST)
Elephant
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో అత్యధిక కాలం జీవించిన ఏనుగుగా రికార్డులకెక్కిన ఆడ ఏనుగు "గజరాణి" మృతి చెందింది. 83ఏళ్ల ఈ ఏనుగు వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్యంతో బాధపడుతోంది. 
 
ఏసియాటిక్ జాతికి చెందిన ఈ ఏనుగును ఏడవ నిజాం జూపార్కుకి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. నగరంలో జరిగే మొహర్రం, బోనాల ఊరేంగిపుతో పాటుగా పలు సంప్రదాయ ఉత్సవాలకు ఈ గజరాణినే ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. 
 
సాధారణంగా ఏనుగుల జీవిత కాలం 60 ఏళ్లేనని, కానీ ఇది 83 ఏళ్లు జీవించిందని జూ అధికారులు తెలిపారు. 7 జులై 1938లో జన్మించిన ఈ ఏనుగును గతేడాది జులైలో టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ దత్తత తీసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతోనే నిన్న ఇదే జూలో ఓ మగ చిరుత కూడా మృతి చెందింది. దీని వయసు 21 సంవత్సరాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సోకి వెంటిలేటర్‌పై గర్భిణీ.. పురుడు పోసిన విశాఖ వైద్యులు