Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యుత్ సరఫరా ఎక్కువైనా, తక్కువైనా గ్రిడ్ కుప్పగూలడం ఖాయం... గండం గడిచిన తెలంగాణ

ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ సగానికిపైగా పడిపోతే.. కరెంటు బిల్లు తగ్గుతుంది లెమ్మని మనుషులు సంతోషపడతారేమో కాని విద్యుత్ గ్రిడ్ మాత్రం ప్రాణమున్న మనిషిలా వణికిపోతుందట. వణికిపోవడం మాత్రమే కాదు. డిమాండ్ పెరగకపోతే గ్రిడ్ కుప్పకూలి రాష్ట్రం మొత్తం కూడా చీక

Advertiesment
Electric grid
హైదరాబాద్ , గురువారం, 11 మే 2017 (08:00 IST)
ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ సగానికిపైగా పడిపోతే.. కరెంటు బిల్లు తగ్గుతుంది లెమ్మని మనుషులు సంతోషపడతారేమో కాని విద్యుత్ గ్రిడ్ మాత్రం ప్రాణమున్న మనిషిలా వణికిపోతుందట. వణికిపోవడం మాత్రమే కాదు. డిమాండ్ పెరగకపోతే గ్రిడ్ కుప్పకూలి రాష్ట్రం మొత్తం కూడా చీకటిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాన్స్‌కో, జెన్‌కో అప్రమత్తంగా వ్యవహరించడంతో తెలంగామ పెద్ద గండం నుంచి తప్పించుకున్నట్లయింది. 
 
మంగళవారం రాత్రి ఆకస్మికంగా గాలివాన రేపిన దుమారంతో తెలంగాణ విద్యుత్ గ్రిడ్ వణికిపోయింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అకస్మాత్తుగా పడి పోయింది. దాంతో, బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 7,177 మెగావాట్లున్న విద్యుత్‌ డిమాండ్‌ కాస్తా అర్ధరాత్రి 11.59 గంట ల ప్రాంతంలో ఒక్కసారిగా 3,459 మెగావాట్లకు పడిపోయింది. ఇలా డిమాండ్‌ ఒక్కసారిగా సగా నికి పైగా తగ్గిపోవడంతో విద్యుత్‌ గ్రిడ్‌ కుప్ప కూలి రాష్ట్రమంతటా చీకటయ్యే ప్రమాదం ఏర్పడింది
 
విద్యుత్‌ డిమాండ్‌కు సమానంగా సరఫరా ఉంటేనే గ్రిడ్‌ సురక్షితంగా ఉంటుంది. హెచ్చుతగ్గులుంటే గ్రిడ్‌ కుప్పకూలి రాష్ట్రమంతటా అంధకారం నెలకొనే ప్రమాదముంటుంది. దాంతో థర్మల్‌ కేంద్రాలను బొగ్గుకు బదులు ఆయిల్‌తో నడిపి అప్పటికప్పుడు విద్యుదుత్ప త్తిని తగ్గించినట్టు ట్రాన్స్‌కో ఇన్‌చార్జి సీఎండీ సి.శ్రీనివాసరావు తెలిపారు. 
 
మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతిని దక్షిణ తెలంగాణలో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) పరిధిలో మంగళవారం మధ్యాహ్నం గరిష్టంగా 5,003 మెగావాట్లుగా నమోదైన విద్యుత్‌ డిమాండ్‌ అర్ధరాత్రి వర్షం కారణంగా 2,160 మెగావాట్లకు పడిపోయింది. ప్రధానంగా హైదరాబాద్‌లో రాత్రంతా చీకట్లు నెలకొన్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో అప్రమత్తంగా వ్యవహరించడంతో గండం గడిచింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లి మందలించినా డ్రైవర్‌ని వదిలేసి కారు తీసుకెళ్లిన నిషిత్.. 200 కి.మీ. స్పీడ్‌‌తో మెట్రోపిల్లర్‌కు ఢీ