Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్: చిన్నారెడ్డి

Advertiesment
తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్: చిన్నారెడ్డి
, ఆదివారం, 21 మార్చి 2021 (10:43 IST)
తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

డబ్బులు లేకపోతే ఎవరు కూడా ఎన్నికల్లో పోటీచేయవద్దని తన విన్నపమన్నారు. పట్టభద్రులు సైతం అధికార టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోందని అన్నారు. కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదని చెప్పారు.

పలుకుబడి 32వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నానన్నారు. డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్‌ను భవిష్యత్‌లో ఎవరు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు.

నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు తట్టుకోగలరన్నారు. తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పునఃనిర్మాణం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురం జిల్లాలో 97 మంది హెచ్‌ఎంల బదిలీ