హైదరాబాద్ నగరంలో ఇటీవల అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ విచారణలో ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న డ్రగ్ పెడ్లర్ లక్ష్మీపతిని అరెస్టు చేశారు. ఈయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈయన్ను గత ఐదు రోజులుగా నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన్ను ఏపీలో అరెస్టు చేశారు. ఈయన విద్యార్థిగా ఉన్నపుడు డ్రగ్స్ విక్రయించాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల లక్ష రూపాయలకు అశిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసిన లక్ష్మీపతి దాన్ని రూ.8 లక్షలకు విక్రయించినట్టు తేలింది. ప్రేమ్ కుమార్‌తో కలిసి ఈ డ్రగ్స్‌ను అనేక మందికి విక్రయించినట్టు పోలీసులు వెల్లడించారు.