తెలంగాణ రైతులు కష్టాల నుంచి బయటపడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇష్టం లేదంటూ మండిపడ్డారు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన సీఎం కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాసారు.
ఆరుగాలం శ్రమించే అన్నదాతలను ఆదుకోవడంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, విత్తనాలు, ఎరువులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసలు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశ్నించారు. ఈ పథకాలు అమలుచేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు. పంటలు వేసేందుకు వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయనీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.