తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ ప్రాజెక్టు గురించి డిస్కవరీ ఛానెల్‌లో ఓ డాక్యుమెంటరీ ప్రసారమైంది.
ప్రాజెక్టు అద్భుత ఘట్టాలను తెలుపుతూ.. 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ డాక్యుమెంటరీని ఇంగ్లీష్, తెలుగు, హిందీ సహా ఆరు భాషల్లో ప్రసారం చేశారు. దాదాపు మూడేళ్ల పాటు నిర్మించిన ప్రాజెక్టు గురించి అందులో పూర్తిగా వివరించారు.
ఇంజనీరింగ్ వండర్ అంటూ ప్రశంసలు కురిపించింది. ప్రాజెక్టు కట్టిన తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చూపించారు. 2017లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కేవలం మూడేళ్లల్లో నిర్మించిన అద్భుత ఘట్టాలను వివరించారు.
ఆసియా టెలివిజన్ అవార్డు, సింగపూర్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను సైతం ఆయన సొంతం చేసుకుందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుతో అనేక ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయి.