Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజీవ్‌తో శిరీషకు 4 ఏళ్లుగా అక్రమ సంబంధం... ఎస్సై రేప్ చేయబోయాడు... సీపీ మహేందర్

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు సంబంధించి హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మీడియాకు వివరాలు తెలియజేశారు. కేసు వివరాలను ఆయన చెపుతూ.... శిరీష ఆత్మహత్యకు కారకులైన రాజీవ్ కుమార్, శ్రావణ్ కుమ

రాజీవ్‌తో శిరీషకు 4 ఏళ్లుగా అక్రమ సంబంధం... ఎస్సై రేప్ చేయబోయాడు... సీపీ మహేందర్
, శుక్రవారం, 16 జూన్ 2017 (15:12 IST)
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు సంబంధించి హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మీడియాకు వివరాలు తెలియజేశారు. కేసు వివరాలను ఆయన చెపుతూ.... శిరీష ఆత్మహత్యకు కారకులైన రాజీవ్ కుమార్, శ్రావణ్ కుమార్‌లను అరెస్టు చేశాం. విజయలక్ష్మి అలియాస్ శిరీష పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వాస్తవ్యురాలు. 13 ఏళ్ల క్రితం సతీష్ చంద్రతో వివాహం జరిగింది. వారికి 12 ఏళ్ల కుమార్తె వుంది. హైదరాబాదులో మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు.
 
విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్ కుమార్ హైదరాబాదులో ఆర్జే స్టూడియో పెట్టుకున్నాడు. అతడి వద్ద శిరీష గత నాలుగేళ్లుగా పనిచేస్తోంది. ఉద్యోగిగా చేరిన శిరీషకి అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదిలావుండగానే రాజీవ్ ఫేస్ బుక్ ద్వారా తేజస్విని అనే మరో యువతితో పరిచయం పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఆమెతో లైంగికంగా కలిశాడు. బెంగళూరులో పనిచేస్తున్న తేజస్విని 3 నెలల క్రితం అక్కడి నుంచి హైదరాబాదుకు ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చింది.
 
రాజీవ్‌ను పెళ్లాడాలని నిర్ణయించుకున్న తేజస్విని అతడి స్టూడియోకు వెళ్లింది. అప్పుడతడు స్టూడియోలో లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్నవారి వద్ద అతడి గురించి వాకబు చేసింది. ఇప్పుడే రాజీవ్, ఆయన భార్య కలిసి బయటకు వెళ్లారని వారు చెప్పారు. దీనితో ఆమెకు అనుమానం వచ్చింది. రాజీవ్‌ను నిలదీయడంతో పాటు శిరీషతో గొడవపడింది.
 
30-5-17 ఉదయం 10 గంటలకు రాజీవ్-తేజస్విని-శిరీష గొడవ పెట్టుకున్నారు. విషయం కొట్టుకునే దాకా వెళ్లింది. దాంతో డయల్ 100కి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చారు. అంతా కలిసి బంజారా హిల్స్ పోలీసు స్టేషనుకు వెళ్లారు. అక్కడ పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. మా సమస్య పరిష్కారం కాకపోతే పోలీసు స్టేషనుకు వస్తానని తేజస్విని చెప్పింది.
 
ఇదిలా జరుగుతుండగానే ఎస్సై శిక్షణకు వచ్చిన శ్రావణ్ ఈ విషయంలో తలదూర్చాడు. 12 జూన్ సాయంత్రం రాజీవ్-శ్రవణ్-శిరీష్ రాత్రి 8 గంటలకు బంజారా హిల్స్ పోలీసు స్టేషనుకు వచ్చారు. సమస్య గురించి తెలుపుగా... స్టేషనులో వున్న ఎస్సై తను కాస్త బిజీగా వున్నాను, వారం తర్వాత రమ్మని చెప్పాడు. ఆ తర్వాత కాఫీ షాప్ వద్దకు వెళ్లి ఆలోచన చేసుకున్నారు. శ్రావణ్ చెప్పిన ప్రకారం అప్పటికప్పుడు కుకునూరుపల్లికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
 
మార్గమధ్యంలో అనీషా వైన్స్‌లో మద్యం కొనుక్కున్నారు. కుకునూర్ పల్లి పోలీసు స్టేషనుకు వెళ్లారు. వారక్కడికి వెళ్లేసరికి రాత్రి 11.30 అయ్యింది. తెల్లవారు జాము 2.30 గంటల వరకూ అక్కడే వున్నారు. ఆ సమయంలో స్మోక్ చేసేందుకు రాజీవ్, శ్రవణ్ బయటకు వెళ్లారు. వీరితో పాటే శిరీష కూడా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఐతే ఎస్సై ప్రభాకర్ రెడ్డి అనుమతించలేదు. తలుపు దగ్గరికి వేసి ఆమెపై రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆమె తను అలాంటిదానిని కాదని కాళ్లమీద పడి ప్రాధేయపడింది. 
 
ఆ క్రమంలో భయపడిపోయి తను వున్న ప్రాంతాన్ని భర్తకు షేర్ చేసింది. అది 1.58 గంటలకు భర్తకు చేరింది. ఆ తర్వాత 2 గంటలకు రాజీవ్‌కు వాట్స్ యాప్ మెసేజ్ పంపింది. రాజీవ్ బీ విత్ మీ, డోంట్ గో ఎవే అని మెసేజ్ పెట్టింది. ఇంతలో వారు లోపలికి వెళ్లగా ఆమె గోడకు నక్కి భయంగా వుంది. నేను అలాంటిదాన్ని కాదని ప్రాధేయపడుతోంది. దానికి ఎస్సై ప్రభాకర్... నేనేమీ చేయలేదు కదా... కూల్ డౌన్ ప్లీజ్ అని అన్నాడు. ఐనా ఆమె వినిపించుకోకుండా పెద్దపెద్దగా అరుస్తోంది. దీనితో ఆగ్రహం చెందిన రాజీవ్ ఆమెను గట్టిగా కొట్టాడు.
 
2.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు. కారులో కంటిన్యూగా ఏడుస్తూనే వుంది. మార్గమధ్యంలో కారు దిగి వెళ్లబోయింది. ఈ సమయంలో రాజీవ్ ఆమె జుట్టు పట్టుకుని కారు లోపలికి నెట్టాడు. తెల్లవారు జామున 3.45 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. శిరీష అపార్టుమెంటు లోపలికి వెళ్లింది. బయటకు రాలేదని 3.55కి రాజీవ్, శ్రవణ్ ఇద్దరూ వెళ్లారు. డోర్ కొట్టినా ఓపెన్ చేయలేదు. దీంతో ఆమె కోపంగా వుందని 3.58కి రాజీవ్ బయటకు వెళ్లాడు. 3.59కి రాజీవ్‌కు శిరీష వీడియో కాల్ చేసింది. దాన్నతడు చూడలేదు. ఆ తర్వాత నాలుగ్గంటలకు ఇతడు వీడియో కాల్ చేశాడు. ఆమె స్పందించలేదు. అనుమానంతో లోపలికి వెళ్లి తలుపు కొట్టాడు. తీయలేదు. దీంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకుని వుంది. 
 
వెంటనే 4.10కి శ్రావణ్‌కి ఫోన్ చేశాడు. ఆ తదుపరి 4.11 డయల్ 100కి ఫోన్ చేశాడు. శిరీషను అపోలోకి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం శ్రావణ్ కారణంగానే జరిగిందని తాము ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఇతడు ఉద్దేశ్యపూరకంగానే వారిని అక్కడికి తీసుకెళ్లాడు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్ద శిరీషను వుండేట్లు చేశాడు. ఇతడి వల్లే ఈ మొత్తం వ్యవహారం జరిగిందని అనుకుంటున్నాం. ఇకపోతే ఎస్సై ప్రభాకర్ రెడ్డి కేసు విచారణలో వుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు" అని సీపీ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బహిరంగంగా ముద్దాడుతుంటే అభ్యంతరం చెప్పాడనీ హతమార్చారు.. ఎక్కడ?