తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దడపుట్టిస్తున్నారు. కొత్త కేసుల నమోదులో ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా, అనేక కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకుతుంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతూ కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.
గడిచిన 24 గంటల్లో 25,693 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 156 మందికి ఈ వైరస్ సోకింది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 54 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరీంనగర్‌లో 47, రంగారెడ్డిలో 12 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే, దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని కాన్పూర్ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ అగర్వాల్ హెచ్చరిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనిషి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తిని ఒమిక్రాన్ వైరస్ ఏమాత్రం తగ్గించబోదని స్పష్టం చేశారు. అలాగే, ఈ వైరస్ వల్ల ఏ ఒక్కరికీ ఎలాంటి క్లిష్టమైన సమస్యలు సంభవించబోవని తెలిపారు.