తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఏకంగా పది మందికి ఈ వైరస్ సోకింది. మొత్తం 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, పది మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ పరీక్షలు నిర్వహించిన వారిలో హైకోర్టు సిబ్బంది, సెక్యూరిటీ బలగాలు ఉన్నారు.
కరోనా ఇన్ఫెక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని హైకోర్టులోని ఫైళ్లు మొత్తం జ్యుడిషియల్ అకాడమీకి తరలించారు. ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని నిర్ణయించారు.
కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా రిజిస్ట్రార్ ఈ కరోనా వైరస్ కారణంగా కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అనేక మంది ఉద్యోగులతో పాటు.. న్యాయ సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో నాలుగైదు రోజుల పాటు హైకోర్టును మూసివేసి శానిటైజ్ కూడా చేయడం జరిగింది.