ఖాకీ-ఖాకీ ప్రేమించారు.. పెళ్లి కూడా చేసుకున్నారు.. కానీ పెళ్ళికి తర్వాత వేధించాడు.. చంపేశాడు!
ఖాకీ-ఖాకీ ప్రేమించుకున్నారు. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పెళ్ళికి తర్వాత తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కానిస్టేబుల్ అయిన ఖాకీ తోటి కానిస్టేబుల్‌పై వేధింపులకు గురిచేసి చంపేసిన ఘటన మె
ఖాకీ-ఖాకీ ప్రేమించుకున్నారు. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పెళ్ళికి తర్వాత తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కానిస్టేబుల్ అయిన ఖాకీ తోటి కానిస్టేబుల్‌పై వేధింపులకు గురిచేసి చంపేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన మహేశ్(26), జహీరాబాద్‌కు చెందిన మంజుల(24) పటాన్‌చెరులో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేసేవారు. వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
కానీ మహేశ్ తనకు జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసి మరీ మంజులను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మహేశ్ కుటుంబం అభ్యంతరం చెప్పింది. కొన్నాళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భార్యను మహేశ్ వేధించాడు. అప్పట్లో రామచంద్రాపురం పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆ తర్వాత జూన్ 23న నిద్రిస్తున్న మంజులను టవల్‌తో ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. తర్వాత ఆటోలో తీసుకెళ్లి తాండూరు-గాజీపూర్ రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు.