Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ వీడియో చూపించిన టి.సీఎం కేసీఆర్... నోరెళ్లబెట్టిన ఏపీ సీఎం బాబు...?

జల జగడం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఏ స్థాయిలో జరుగుతుందో తెలిసిందే. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రభుత్వాన్ని కూల్చేయనన్నా కూల్చేస్తాను కానీ కావేరి జలాలను తమిళనాడుకి ఇచ్చేది లేదని అంటున్నారట. నీళ్ల వ్యవహారం అంతవరకూ వచ్చింది మరి. ఇదిలావుం

Advertiesment
Telangana water projects
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (18:29 IST)
జల జగడం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఏ స్థాయిలో జరుగుతుందో తెలిసిందే. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రభుత్వాన్ని కూల్చేయనన్నా కూల్చేస్తాను కానీ కావేరి జలాలను తమిళనాడుకి ఇచ్చేది లేదని అంటున్నారట. నీళ్ల వ్యవహారం అంతవరకూ వచ్చింది మరి. ఇదిలావుంటే ఏపీ-తెలంగాణ నీటి ప్రాజెక్టుల అంశంపై కేంద్రమంత్రి ఉమాభారతి వద్ద ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతోందంటూ ఏపీ తన వాదనను వినిపించింది. 
 
ఐతే తాము కడుతున్నవి కొత్తవి కాదనీ, పాత ప్రాజెక్టులేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధారాలతో సహా చూపించారట. ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా పాలమూరు, డిండి ప్రాజెక్టు కొత్తవి కావని జీవోలు, వీడియోలు ముందు పెట్టారట. డిండి ప్రాజెక్టు నిర్మాణం కోసం 2007లో వైఎస్ సర్కారు జారీ చేసిన జీవో నెంబరు 159, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం 2013లో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు జీవో 72ను విడుదల చేసినవి బయటపెట్టారు. 
 
అంతేకాదు 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సమక్షంలో, భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి అయిన నరేంద్రమోడీ మహబూబ్ నగర్ సభలో జిల్లా రైతుల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేదంటూ ఆయన చేసిన విమర్శకు సంబంధించిన క్లిప్పింగును చూపించారట. దీనితో ఇక ఏపీ ప్రభుత్వం నోరెళ్లబెట్టాల్సి వచ్చిందట. తాము నిర్మిస్తున్నవి కొత్త ప్రాజెక్టులు కాదని చెప్పడంలో కేసీఆర్ విజయం సాధించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో-ఎయిర్‌టెల్ 4జీ నెట్వర్కుల్లో ఏది బెస్ట్ తెలుసుకుందామా? అదే బెస్ట్.. ఏది..?