Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఆర్ఎస్‌కు చుక్కలు చూపించిన తీన్మార్‌ మల్లన్నపై కేసు..?

Advertiesment
టీఆర్ఎస్‌కు చుక్కలు చూపించిన తీన్మార్‌ మల్లన్నపై కేసు..?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:20 IST)
teenmar mallanna
తీన్మార్‌ మల్లన్న గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఓ ప్రముఖ ఛానల్‌ వచ్చే ప్రొగ్రాం పేరునే తన పేరుగా మార్చుకున్నాడు మల్లన్న. తీన్మార్‌ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్‌. అయితే... నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓట్లు సాధించి... అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తీన్మార్‌ మల్లన్న చుక్కలు చూపించారు. చివరి వరకు పోరాడినా మల్లన్నకు ఓటమి తప్పలేదు. అయితే..తాజాగా నవీన్ పై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
సీతాఫల్ మండి మధురానగర్ కాలనీలో లక్ష్మి కాంత్ శర్మ మారుతి జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసాడని, ఇవ్వకుంటే తప్పుడు వార్తా కథనాలు ప్రచారం చేస్తానని బెదిరించినట్లు లక్ష్మి కాంత్ శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
డబ్బు ఇవ్వకపోవటంతో ఈ నెల 20న తనపై తప్పుడు కథనాలు చేసినట్లు కూడా తెలిపారు లక్ష్మి కాంత్ శర్మ. 22 వ తేదీ రాత్రి పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయటంతో తీన్మార్ మల్లన్న పై ఐపీసీ 387, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాలంటీర్ల పనితీరు అద్భుతం: మంత్రి వెలంప‌ల్లి