మహబూబ్ నగర్ లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బృందావన్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి ఈ ముఠా యత్నించిందని, ఈ ఘటన ఆ ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని సమాచారం.
నాలుగు రోజుల క్రితం ఇదే కాలనీలో మరో దోపిడీ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ బంగారం, నగదుచోరీకి గురయ్యాయని తెలుస్తోంది. పదేపదే జరుగుతున్న సంఘటనలు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.