చందనా బ్రదర్స్ ఎండీ రామారావు అరెస్ట్
హైదరాబాదు: ప్రముఖ వస్త్ర నగల వ్యాపార సంస్థ చందనా బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామారావును చీటింగ్ కేసులో ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొడుకు ఫణీంద్ర తనను బెదరిస్తున్నాడని ఇంతకుముందు పోలీస్
హైదరాబాదు: ప్రముఖ వస్త్ర నగల వ్యాపార సంస్థ చందనా బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామారావును చీటింగ్ కేసులో ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొడుకు ఫణీంద్ర తనను బెదరిస్తున్నాడని ఇంతకుముందు పోలీస్ స్టేషన్‌లో రామారావు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు బూటకమని తేలడంతో రామారావుపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
చందనా బ్రదర్స్ ఎండీ రామారావు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంధ్ర మధ్య తలెత్తిన వివాదం చివరికి అరెస్ట్ వరకు వెళ్లింది. తొమ్మిది కోట్ల రూపాయల రుణం కావాలని కన్నా కుమారుడు ఫణీంద్రను కలిశాడు ఎండీ రామారావు. ఈ డీల్ లో కొంత కమీషన్ కూడా ఇస్తానని ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగింది. అనుకున్నట్లుగానే తొమ్మిది కోట్లలో కొంత లోన్ వచ్చింది చందనా ఎండీ రామారావుకు. మిగతాది రాలేదు.
ఈ లోన్ విషయంలో ఫణీంద్రకు చెల్లించాల్సిన కమీషన్ పై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీన్ని పర్సనల్ గా తీసుకున్న రామారావు.. మూడు నెలల క్రితం ఫణీంద్ర నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఓ లేఖను కూడా ఇచ్చాడు. ఈ లేఖను రామారావే రాసి.. తన డ్రైవర్ తో గుంటూరు నుంచి పోస్ట్ చేయించాడు. విచారణలో ఇది తప్పుడు లేఖ అని తేలింది. పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు చందనా బ్రదర్స్ ఎండీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్ పోలీసులు.