కరోనా ప్రభావం రాష్ట్రంలో అన్ని రంగాలతో పాటు విద్యావ్యవస్థపై పడటంతో అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై శనివారం తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన రీ-షెడ్యూల్‌ను వెల్లడించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి.
సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, కళాశాల, టెక్నికల్ విద్యా శాఖ కమిషనర్, ఉన్నత విద్యామండలి అధికారులు సమావేశమై ఎంసెట్ ,ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చ జరిపి చివరికి డేట్లు ప్రకటించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. జూలై 8 నుంచి లాసెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ :
ఎంసెట్- జులై 6 నుంచి 9 వరకు
ఈసెట్ - జులై 4
లాసెట్- జులై 10
టీఎస్ పీజీఈసెట్- జులై 1 నుంచి 3 వరకు
టీఎస్ పాలిసెట్- జులై 1
ఐసెట్- జులై13
ఎడ్‌సెట్- జులై 15