Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే.. బీఆర్ఎస్

Advertiesment
Chandra Babu
, బుధవారం, 1 నవంబరు 2023 (11:08 IST)
తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. 
 
అరికెపూడి గాంధీ మాట్లాడుతూ... చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం మంచి పరిణామమని తెలిపారు. చంద్రబాబు కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలపుతున్నానని వెల్లడించారు. 
 
చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని, వీటిలో ఒక్క కేసు కూడా నిలబడదని ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చినట్టే... అన్ని కేసుల నుంచి చంద్రబాబు బయటపడతారని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నిక సంఘం బృందం పర్యటన