Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్కడి యురేనియం నాణ్యమైంది కాదట: ఆందుకే ఆ రెండు జిల్లాలూ బతికిపోయాయ్!

నాణ్యత లేకుంటే ఏ వస్తువూ అమ్ముడుపోదని అందరికీ తెలుసు. క్వాలిటీ లేకపోతే స్టార్ హోటల్ కూడా బతికి బట్టకట్టదని ప్రతి వ్యాపారికీ తెలుసు. కానీ ఆ క్వాలిటీ లేనందుకు రెండు జిల్లాల పరిధిలోని ఒక ప్రాంతం జనాభా అమయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఘటనకు మహబూబ్‌నగర్, న

అక్కడి యురేనియం నాణ్యమైంది కాదట: ఆందుకే ఆ రెండు జిల్లాలూ బతికిపోయాయ్!
హైదరాబాద్ , మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (03:06 IST)
నాణ్యత లేకుంటే ఏ వస్తువూ అమ్ముడుపోదని అందరికీ తెలుసు. క్వాలిటీ లేకపోతే స్టార్ హోటల్ కూడా బతికి బట్టకట్టదని ప్రతి వ్యాపారికీ తెలుసు. కానీ ఆ క్వాలిటీ లేనందుకు రెండు జిల్లాల పరిధిలోని ఒక ప్రాంతం జనాభా అమయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఘటనకు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు సాక్షీభూతంగా నిలిచాయి. ఈ ప్రాంతంలో లభించే యురేనియం అంత నాణ్యమైనది కాదు కాబట్టి యురేనియం వెలికితీతకు చర్యలు చేపట్టడం లేదని తెలంగాణ వన్య ప్రాణి సంరక్షణ బోర్డు స్పష్టం చేయడంతో ఈ ప్రాంత ప్రజలక పెద్ద ఉపశమనం కలిగినట్లే అయింది. 
 
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో యురేనియం నిల్వల వెలికితీతకు బ్రేక్‌ పడింది. అక్కడ మైనింగ్‌ ద్వారా యురేనియం వెలికితీతకు చర్యలేమీ చేపట్టడం లేదంటూ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సోమవారం జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది. అయితే నిజానికి ఇక్కడ లభించే యురేనియం అంత నాణ్యమైనది కాదు గనక పెద్దగా ఉపయోగముండదన్న కేంద్ర యురేనియం కార్పొరేషన్‌ నివేదికల వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
 
మైనింగ్‌ ద్వారా యురేనియాన్ని వెలికితీయాలని కాకుండా అధ్యయనం, పరిశీలన చేయాలని మాత్రమే ప్రతిపాదిస్తున్నట్లు తాజా సమావేశంలో బోర్డు వివరణ ఇచ్చింది. యురేనియం నిల్వల కోసం అన్వేషణకు ఆమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలోని పులుల రిజర్వ్‌లో అనుమతి, కవ్వాల్‌ అభయారణ్యంలో పగటి పూట భారీ వాహనాలకు అనుమతి తదితరాల నుంచి కూడా బోర్డు వెనక్కు తగ్గింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైతాన్ ప్రవేశించింది కాబట్టే అమ్మాయిలు జీన్స్ వేస్తున్నారు: చర్చి పాస్టర్ బాధ