Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో మరో జాబ్ నోటిఫికేషన్ - 1271 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన

Advertiesment
ts job notification
, మంగళవారం, 10 మే 2022 (11:40 IST)
తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి. మరోవైపు, ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులను ఆకర్షించేలా ఉద్యోగ ఖాళీలను భర్తీకి శ్రీకారం చుట్టింది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. 
 
ఈ నోటిఫికేషన్‌ను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్) జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,271 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ విద్యుత్ శాఖ ప్రకటించింది. 
 
ఈ నెల 11వ తేదీ నుంచి ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1271 పోస్టులు కాగా వీటిలో సబ్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ విభాగంలో 201, జూనియర్ లైన్‌మెన్ 1000, అసిస్టెంట్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ విభాగనంలో 70 పోస్టులు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా తీవ్రత