Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జల వివాదంపై ఏపీ రైతు హౌస్ మోషన్ పిటిన్ దాఖలు

Advertiesment
జల వివాదంపై ఏపీ రైతు హౌస్ మోషన్ పిటిన్ దాఖలు
, ఆదివారం, 4 జులై 2021 (12:33 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రతరమవుతోంది. ఇప్పటికే జలాశయాల వద్ద ఇరు రాష్ట్రాలు పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మొహరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణా జలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతు హౌస్‌‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 
 
పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కృష్ణా జిల్లాకు చెందిన రైతు తెలిపారు. జూన్‌ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీరు వదలడం వల్ల ఏపీకి నష్టం కలుగుతోందని అందులో పేర్కొన్నారు. 
 
అడ్డుకుని తీరుతామంటున్న కేసీఆర్ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సక్రమంగా లేదని, అందువల్ల ఆ రాష్ట్ర తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను కట్టనివ్వబోమని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నీటి కేటాయింపులు లేకుండానే, పర్యావరణ అనుమతులు రాకుండానే ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
ఏపీ తీరు అక్రమం అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రాజెక్టుల పనులు జరుగుతూనే వున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఒక చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమ ప్రాజెక్టేనని ఆరోపించారు.
 
ఇక, జులై 9న నిర్వహించ తలపెట్టిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేసి, జులై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించి, ఇకపై 50:50 నిష్పత్తిలో పంపకాలు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఈ మేరకు తెలంగాణ అజెండాను సిద్ధం చేసి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు పంపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు. కేంద్ర జలవనరుల శాఖామంత్రితో కూడా సమావేశం వినతిపత్రం సమర్పించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ తీరు సక్రమంగా లేదు.. ప్రాజెక్టులు కట్టనివ్వం : సీఎం కేసీఆర్