టీచర్ కొడుతుందని మేడపై నుంచి దూకేసిన విద్యార్థి...

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:35 IST)
హైదరాబాదులో స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేగుతోంది. స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఆర్ నగర్ లోని విశ్వభారతి హైస్కూల్‌లో మహేష్ 8 తరగతి చదువుతున్నాడు. హోంవర్క్ చేయకపోవడంతో టీచర్ అందరి విద్యార్థుల్ని మందలించి కొడుతున్నారు.
 
ఇది చూసిన మహేష్‌కు భయం పట్టుకుంది. తనను కూడా టీచరు కొడుతుందని భయం పట్టుకుంది. దీంతో భవనం పైనుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. దీంతో మహేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్కూల్ యాజమాన్యం పక్కనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గత నెల 28వ తేదీన స్కూలు మేడ పైనుంచి దూకిన మహేష్ ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటుగా టీచర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చనిపోయిన మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వరంగల్‌ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి