Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ జీతం అంతేనా? వ్యభిచారం చేస్తే నెలకు రూ.50 వేలంటూ యువతిని...

ఆధునిక జీవితంలో ఎన్నో అలవాట్లు. సెల్ ఫోన్, ఫ్యాషనబుల్ ఐటెమ్స్, క్రీమ్స్, ఇంకా... ఇంకా.. ఎన్నెన్నో అవసరాలు. ఐతే పిండికొద్దీ రొట్టె అన్నట్లు కొందరు తమకు వున్నదానిలోనే జీవితాన్ని లాగించేస్తుంటారు. కానీ మరికొందరు అలాక్కాదు. ఎలాగైనా తాము అనుకున్న విధంగా జ

Advertiesment
నీ జీతం అంతేనా? వ్యభిచారం చేస్తే నెలకు రూ.50 వేలంటూ యువతిని...
, శుక్రవారం, 1 జూన్ 2018 (13:51 IST)
ఆధునిక జీవితంలో ఎన్నో అలవాట్లు. సెల్ ఫోన్, ఫ్యాషనబుల్ ఐటెమ్స్, క్రీమ్స్, ఇంకా... ఇంకా.. ఎన్నెన్నో అవసరాలు. ఐతే పిండికొద్దీ రొట్టె అన్నట్లు కొందరు తమకు వున్నదానిలోనే జీవితాన్ని లాగించేస్తుంటారు. కానీ మరికొందరు అలాక్కాదు. ఎలాగైనా తాము అనుకున్న విధంగా జీవించాలని కోరుకుంటారు. ఇదే వారిని పక్కదోవ పట్టించేస్తుంది. ఇలాంటిదే ఒకటి జరిగింది. 
 
నెల్లూరు దర్గామిట్ట ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల షేక్ రహ్మాన్ హైదరాబాదులో ఓ ప్రముఖ కంపెనీలో రూ.25 వేలకు ఉద్యోగం చేస్తున్నాడు. ఐతే తను చదివిన చదువుకు లక్షల్లో జీతం రావాల్సిందనీ, కంపెనీలు తనకు తక్కువ జీతం ఇస్తున్నాయంటూ మధనపడేవాడు. ఎలాగైనా తను అనుకున్నట్లు జీతం ఎక్కువ ఆర్జించాలని దారులు వెతకటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతడికి ఒంగోలుకు చెందిన ఓ యువతి హైదరాబాదులో అతడికి పరిచయమైంది. ఆమె కూడా తనకు బ్యూటీ పార్లల్‌లో వస్తున్న జీతంపై తీవ్ర నిరాశలో మునిగిపోయి వుండటాన్ని గమనించాడు. ఇద్దరూ కొన్నిరోజులు బాగా చర్చించుకున్నారు. 
 
రహ్మాన్ ఆమెకు ఓ ఐడియా ఇచ్చాడు. తను చెప్పినట్లు చేస్తే నెలకు రూ.50 వేలు నీకిస్తానంటూ ఆమెతో అన్నాడు. వ్యభిచారం చేస్తే లక్షల్లో డబ్బు సంపాదించవచ్చుననీ ఆమెను ఒప్పించాడు. ఆమె అంగీకరించగానే ఆన్లైన్లో ఆమె ఫోటో పెట్టి విటులకు ఎర వేయడం మొదలుపెట్టాడు. ఐతే ఇది కాస్తా పోలీసులు పసిగట్టడంతో వారిద్దరూ కలసి వుంటున్న బంజారాహిల్స్‌ రోడ్డు నం. 12లోని ఓ ప్లాట్‌లో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు 'తుప్పు'... లోకేష్ 'పప్పు'... జగన్ మోహన్ రెడ్డి ధ్వజం