Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్‌... శృంగారానికి నో అన్నందుకు ఆ సైట్లో పెట్టేశాడు...

సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లలో పరిచయం అక్కరలేనిది ఫేస్‌బుక్. కానీ ఈ అప్లికేషన్‌తో మంచి కంటే ఎక్కువగా చెడు ఉదంతాలే చోటుచేసుకుంటున్నాయి, ముఖ్యంగా అమ్మాయిలకు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఫేస్‌బుక్‌లో అజ్ఞాత వ్యక్తి పంపిన ఫ్ర

Advertiesment
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్‌... శృంగారానికి నో అన్నందుకు ఆ సైట్లో పెట్టేశాడు...
, శుక్రవారం, 4 ఆగస్టు 2017 (19:30 IST)
సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లలో పరిచయం అక్కరలేనిది ఫేస్‌బుక్. కానీ ఈ అప్లికేషన్‌తో మంచి కంటే ఎక్కువగా చెడు ఉదంతాలే చోటుచేసుకుంటున్నాయి, ముఖ్యంగా అమ్మాయిలకు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఫేస్‌బుక్‌లో అజ్ఞాత వ్యక్తి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఆమోదించింది. కొద్ది రోజులు వారి మధ్య సంభాషణ మామూలుగానే జరిగింది. 
 
ఆపై ఆ వ్యక్తి సెక్స్‌కు సంబంధించిన సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. దీంతో షాక్‌కు గురైన ఆ అమ్మాయి అతడిని హెచ్చరించి, బ్లాక్ చేసింది. ఆమెపై పగ పెంచుకుని ఆమె అసలు పేరు మరియు ఫోటోతో ఫేస్‌బుక్‌లో ఒక నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించి, ఆమె పరిచయాలలో ఉన్న వ్యక్తులకు అసభ్యకరమైన సందేశాలను పంపడం మొదలుపెట్టాడు. 
 
అంతటితో ఆగకుండా కొన్ని పోర్న్ సైట్‌లలో కూడా ఆ అమ్మాయి ఫోటో మరియు ఫోన్ నంబర్‌ను పోస్ట్ చేసాడు. ఇతడిని కరీంనగర్‌కు చెందిన ఆర్.నరేష్‌గా గుర్తించి పోలీసులు అరెస్టు చేసారు. అమ్మాయిలూ, ఫేస్‌బుక్‌లో మీ వివరాలను పెట్టే ముందు అజ్ఞాత వ్యక్తులతో పరిచయాలను పెంచుకునేముందు మరొకసారి ఆలోచించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుడి కారు వరదల్లో చిక్కుకుంది.. పట్టువదలకుండా నెట్టుకెళ్ళి.. పెళ్ళి చేసుకున్నాడు.. (వీడియో)