Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు మంచి ముక్కలు... వెంటనే ఛాటింగ్... ఆ తర్వాత నగ్న ఫోటోలు... 14 మందిని...

ఓరి దేవుడోయ్... సోషల్ మీడియాతో జాగ్రత్తగా వుండాలండోయ్ అంటున్నా వినిపించుకునేవారెవరు. ఫేస్ బుక్కులో తన మాటలకో, పరిస్థితికో మేకవన్నె పులి పొంచి వుంటుందని ఎన్ని నిదర్శనాలు కనబడుతున్నా మాయలో పడిపోతున్నారు చాలామంది. అమ్మాయిలను ఎలాగో మాయ చేసి మోసం చేస్తున్

రెండు మంచి ముక్కలు... వెంటనే ఛాటింగ్... ఆ తర్వాత నగ్న ఫోటోలు... 14 మందిని...
, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (21:59 IST)
ఓరి దేవుడోయ్... సోషల్ మీడియాతో జాగ్రత్తగా వుండాలండోయ్ అంటున్నా వినిపించుకునేవారెవరు. ఫేస్ బుక్కులో తన మాటలకో, పరిస్థితికో మేకవన్నె పులి పొంచి వుంటుందని ఎన్ని నిదర్శనాలు కనబడుతున్నా మాయలో పడిపోతున్నారు చాలామంది. అమ్మాయిలను ఎలాగో మాయ చేసి మోసం చేస్తున్నారు కామాంధులు. ముఖ్యంగా తమ ఫేస్ బుక్కు ఖాతాకు ఎంతమంది ఫాలోయర్లు వుంటే అంత క్రేజ్. ఇంకేముంది అలాంటి ఫాలోయెర్లలోనే ఉంటాడో మోసగాడు. ఇలాంటివాడు హైదరాబాదులో 14 మంది అమ్మాయిలను మోసం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితుల్లో ఓ అమ్మాయి షీ-టీమ్స్‌ను ఆశ్రయించడంతో అసలు సంగతి బయటపడింది.
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాదుకు చెందిన 30 ఏళ్ల యువకుడు రకరకాల పేర్లతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచాడు. ఫ్రెండ్ అంటూ 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలతో ఎఫ్బీ స్నేహం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వారితో చాటింగ్ చేస్తూ వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకునేవాడు. ఆ తర్వాత వారు ఏదయినా సమస్యలో ఇరుక్కున్నారని తెలిస్తే ఓదార్చడాలు, నక్క వినయాలు పోయేవాడు. 
 
ఇతగాడు చాలా మంచివాడని నమ్మేసేవారు అమ్మాయిలు. అలా వారి మనసులో ముద్రపడ్డ ఇతడు వారి వివిధ ఖాతాల లాగిన్ పాస్ వర్డ్ లను చేజిక్కించుకునేవాడు. దాని ద్వారా వారు తమ స్నేహితులతో చేసే చాటింగులు, ప్రేమ వ్యవహారాలన్నీ పట్టేసి వాటిని చూపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. వాటిని పేరెంట్స్ కు పంపుతానని భయపెట్టేవాడు. ఇవన్నీ జరక్కుండా వుండాలంటే తనకు నగ్న ఫోటోలు పంపాలనీ, మరికొందరి వద్ద డబ్బు డిమాండ్... ఇలా అనేక రకాలుగా హింసించేవాడు. ఇలా కొందరి దగ్గర డబ్బులు గుంజినట్లు తెలుస్తోంది. వీడి బాధ భరించలేక ఓ యువతి విషయాన్ని షీ టీమ్స్‌కు చేరవేసింది. అతడి కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో సిమ్‌కు పోటీగా ఎయిర్‌టెల్ 'బాహుబలి' సిమ్... ఫ్రీ 4జి డేటా, ప్రభాస్ పెళ్లి న్యూస్...