Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పని ఉందని రమ్మన్నాడు. మత్తుమందిచ్చాడు. పని కానిచ్చాడు.. వీడి వృత్తి తగలడా?

పనీ పాటా లేని పోకిరీలూ అదే పనిచేస్తున్నారు. కామనరం ఉబ్బిపోయిన వారూ అదే పని చేస్తున్నారు. చివరకు లాయర్ల వంటి ఉన్నత విద్యావంతులూ అదే పనిచేస్తున్నారు. వర్గాలకు అతీతంగా ఆడది కనిపిస్తే చాలు పట్టుకుని రేప్ చేసేస్తున్న ఈ పిదప బుద్దుల పీచమడిచే మార్గమేమిటి. ఇ

పని ఉందని రమ్మన్నాడు. మత్తుమందిచ్చాడు. పని కానిచ్చాడు.. వీడి వృత్తి తగలడా?
హైదరాబాద్ , శనివారం, 8 జులై 2017 (08:21 IST)
పనీ పాటా లేని పోకిరీలూ అదే పనిచేస్తున్నారు. కామనరం ఉబ్బిపోయిన వారూ అదే పని చేస్తున్నారు. చివరకు లాయర్ల వంటి ఉన్నత విద్యావంతులూ అదే పనిచేస్తున్నారు. వర్గాలకు అతీతంగా ఆడది కనిపిస్తే చాలు పట్టుకుని రేప్ చేసేస్తున్న ఈ పిదప బుద్దుల పీచమడిచే మార్గమేమిటి. ఇది యావత్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. అరవై ఎళ్లు దాటిన న్యాయవాది రోడ్డుసైట్ పోకిరీలకంటే ఘోరంగా తన యింటికి పనికి వచ్చిన మహిళ పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఇక న్యాయం ఎవరినడిగాలి?
 
వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. వయస్సు 60 ఏళ్లు. ఇంట్లో పని చేయాల్సి ఉంది వస్తావా అని ఒక మహిళను కోరి పిలిపించుకున్నాడు. సెక్యూరిటీ గార్డు సహాయంతో ఆమెకు మత్తుమందు ఇచ్చి ఇద్దరూ రేప్ చేశారు. ఆమె పోలీసులకు రిపోర్ట్ చేయడంతో ఈ మద పిచ్చి లాయర్, సెక్యూరిటీ గార్డు పరారీలో ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళితే న్యూ నాగోల్‌లో నివసించే ప్రకాశ్‌ (60) వృత్తిరీత్యా న్యాయవాది. అతడి కుటుంబ సభ్యులందరూ కొద్దిరోజుల క్రితం కొంపల్లికి వెళ్లడంతో ప్రకాశ్‌ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. తన ఇంట్లో పనిచేసేందుకు మనిషి కావాలని తనకు తెలిసిన సెక్యూరిటీ గార్డు కృష్ణ(35)కు చెప్పాడు. కృష్ణ తనకు తెలిసిన మరో సెక్యూరిటీ గార్డు ద్వారా యూసు్‌ఫగూడకు చెందిన మహిళ(43)ను జూన్‌ 29న ప్రకాశ్‌ ఇంటికి పిలిపించాడు. అయితే, ఆమెకు ఆహారంలో వారు మత్తు మందు కలిపి ఇచ్చారు. కొద్దిసేపటికి సృహకోల్పోవడంతో ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అనంతరం ఆమెను రాత్రి యూసు్‌ఫగూడలో దింపివచ్చారు. వారం తర్వాత జరిగిన దారుణాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సూచన మేరకు ఆమె.. చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు సీఐ గురురాఘవేందర్‌ వెల్లడించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాపింగ్ మాల్స్, ఐమ్యాక్స్‌ల్లో నిలువుదోపిడీ ఇకనైనా ఆగేనా.. కేంద్రం కొరడా నిజంగానే తగిలేనా?