Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక... ఆదర్శ దంపతులు.. భార్య కోసం..?

భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక... ఆదర్శ దంపతులు.. భార్య కోసం..?
, గురువారం, 5 ఆగస్టు 2021 (20:05 IST)
ఆధునిక సమాజంలో భార్యాభర్తల సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి భార్యాభర్తల మధ్య కొద్దిమంది ఆదర్శ దంపతులు కూడా ఉంటారని ఈ జంట నిరూపిస్తోంది. భార్య చనిపోయినా ఆమెనే ఆరాధ్య దైవంగా పూజించే వ్యక్తులు కూడా ఉంటారని నిరూపిస్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పడాల గంగాధర్, చంద్రబాగు దంపతులు. ఈ దంపతులు అన్యోన్యంగా జీవించేవారు. ఒకరంటే మరొకరికి పంచ ప్రాణాలుగా ఉండేవారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా భర్త గంగాదర్ కిరాణ షాప్ నడిపేవారు.. భార్య చంద్రబాగు బీడిలు చేసుకుంటూ ఉండేవారు.. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి దాంపత్య బంధాన్ని విధి వెక్కిరించింది.
 
2007 ఏప్రిల్లో ఒకరోజు రాత్రి తన ఇంటి దాబా పైన పడుకున్న చంద్రబాగు ప్రమాదవశాత్తు డాబాపై నుంచి పడిపోయింది.. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి.. చికిత్స పొందుతూ వారం రోజుల తరువాత ఆసుపత్రిలో మృతి చెందింది. అయితే భార్య మృతిని గంగాధర్ జీర్ణించుకోలేక పోయాడు.. దీంతో ఆమెను మర్చిపోలేక భర్త గంగాదర్ భార్య కోసం ప్రత్యేకంగా ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. గద్దేను నిర్మించి గద్దేపై విగ్రహన్ని ఏర్పాటు చేసి పై కప్పు నిర్మించారు..
 
కాని ఇటివల అయితే భార్య విగ్రహం ఒంటరి అవుతుందని భావించి ఆమెకు తోడుగా నేను ఉంటానని తను బ్రతికి ఉండగానే తన విగ్రహాన్ని కూడా చేయించుకున్నారు. భార్య విగ్రహం పక్కనే తన విగ్రహన్ని పెట్టాడు. ప్రతి రోజు ఆ విగ్రహలను శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్నారు.. చూసేందుకు వింతగా ఉన్నా ఇది నిజం.. భార్యపై ఉన్న ప్రేమను తను ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారు.
 
మేము పెళ్లి నాటి నుంచి కలిసిమెలిసి కష్టసుఖాల్లో పాలుపంచుకునే జీవనం సాగించామని గంగాదర్ చెబుతున్నాడు. ఒకరి మాటకు ఒకరం విలువనిస్తూ కలిసి ఉండేవారిమి. అర్థంతరంగా నా భార్య చనిపోవడంతో ఆమెను మర్చిపోలేకపోయాను. 
 
ఆమె కోసం ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయించాను. ఆ విగ్రహం ఒంటరిగా ఉండడం నాకు నచ్చలేదు. దీంతో నా విగ్రహాన్ని కూడా ఆమెకు తోడుగా పెట్టాను. మా బంధం విడదీయరానిదిగా ఉండాలని ఆమె లేని లోటు ను ఆమె విగ్రహంలో చూసుకుని జీవిస్తున్నారని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పులిచింత‌ల గేటు మ‌ర‌మ్మ‌తు