Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సారూ ఆస్తిలో భాగం ఇప్పించండి.. సచ్చేంతవరకు నేనే వండుకుని తింటా: తల్లి వేదన

మీడియా గొప్ప గొప్ప పనులు చేసి సమాజాన్ని ఉద్ధరించాల్సిన పనిలేదు. మనుషుల మధ్య బంధాలనే చిద్రం చేస్తున్న అమానుష కృత్యాలను కాస్త ప్రంపంచం దృష్టికి తీసుకువస్తే చాలు మనసున్న మారాజులు కొందరి గుండెలయినా కరిగించి కొన్ని జీవితాలను బాగుపర్చే అవకాశం ఉంటుందనడానికి

సారూ ఆస్తిలో భాగం ఇప్పించండి.. సచ్చేంతవరకు నేనే వండుకుని తింటా: తల్లి వేదన
హైదరాబాద్ , మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (07:08 IST)
మీడియా గొప్ప గొప్ప పనులు చేసి సమాజాన్ని ఉద్ధరించాల్సిన పనిలేదు. మనుషుల మధ్య బంధాలనే చిద్రం చేస్తున్న అమానుష కృత్యాలను కాస్త ప్రంపంచం దృష్టికి తీసుకువస్తే చాలు మనసున్న మారాజులు కొందరి గుండెలయినా కరిగించి కొన్ని జీవితాలను బాగుపర్చే అవకాశం ఉంటుందనడానికి ఈ కథనం చిన్ని ఉదాహరణ. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మకు 85 ఏళ్లు. ఆమెకు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. నిలువ నీడలేక.. కుమారుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ సంఘటనపై ‘అమ్మను గెంటేశారు’ శీర్షికన సోమవారం ఒక పత్రికలో వచ్చిన కథనానికి తెలంగాణ మంత్రి కె. తారకరామారావు స్పందించారు. ఆ కథనాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చే్యడమే కాకుండా ఆమెకు అండగా నిలవాలని అధికార యంత్రాంగానికి ఫోన్ చేసి ఆదేశించారు. సిరిసిల్ల డీఆర్వో వెంటనే కమలమ్మతో మాట్లాడి ఆమె ఫిర్యాదును స్వీకరించారు.
 
ఆమె కుమారులు ఐదుగురికీ సోమవారం ప్రభుత్వం తరపున నోటీసులు జారీ చేశారు. కమలమ్మతో జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) సరస్వతి మాట్లాడారు. చర్చల అనంతరం, మూడో కుమారుడు శ్రీనివాస్‌ వద్ద కమలమ్మ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్‌ కమలమ్మ ఇంటికి వెళ్లి పండ్లు అందించారు. భీవండిలో ఉండే కుమారుడు రమేశ్‌తో రెవెన్యూ అధికారులు ఫోన్‌లో మాట్లాడారు. బుధవారం సిరిసిల్లకు వచ్చేందుకు రమేశ్‌ అంగీకరించాడు. జిల్లా అధికారుల సమక్షంలో కమలమ్మ కొడుకులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి.. ఆమెకు నీడ కల్పించేలా చర్యలు తీసుకుంటామని డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ తెలిపారు. కన్నతల్లిని పోషించకుంటే కొడుకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. 
 
మంత్రి నుంచి వచ్చిన ఆదేశాలను అధికారులు ఆగమేఘాల మీద వచ్చి అమలు చేసి ఉండవచ్చు కానీ ఆ తర్వాత ఆ కన్నతల్లి చేసిన శపథం వింటున్న వారి గుండెల్ని బరువెక్కించింది. ఆమె ఏ గొంతెమ్మకోరికలూ అడగలేదు. తన ఐదుగురు కొడుకులతోపాటు తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని, ఎవరూ సాకకున్నా సచ్చేంత వరకు తానే వండుకుని తింటానని కమలమ్మ తెలిపింది. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. అయిదుగురు కొడుకుల మీదా నమ్మకం పోయిందామెకు. 
 
ఆస్తిలో భాగం అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ముసలి వాళ్లకు ఏ ఆస్తులూ లేకుండా చేయడం వల్లే కదా వారు పనిచేయలేని స్థితిలో అనాధలుగా మిగిలి కుటుంబాలచేత వెలికి గురవుతున్నారు. అదే పాయింట్‌మీద నిలిచిన ఆమె నా భాగం నాకు ఇస్తే సచ్చేంతవరకు స్వతంత్రంగా బతుకుతానని తెగేసి చెప్పింది. కుటుంబ బంధాలు ఆస్తి పాశానికి చిక్కి తెగిపోయిన పాడుకాలంలో ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రులకు  జరగాల్సిన న్యాయం ఇదే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయిదు శస్త్ర చికిత్సలు చేసి నేలపై నిద్రించిన మాన్య వైద్యుడు: ఇతడే మా హీరో అంటున్న నెటిజన్లు