హైదరాబాద్ నగరంలో దాదాపు 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఏకంగా 36 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులో ప్రధాన రవాణా సౌకర్యాల్లో ఎంఎంటీఎస్ ఒకటి. అయితే, ట్రాక్ నిర్వహణ కారణంగా మొత్తం 79 సర్వీసుల్లో 36 సర్వీసులను రద్దు చేసింది.
వీటిలో లింగంపల్లి - హైదరాబాద్ మీదుగా నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లిల మధ్య నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి మీదుగా నడిచే 8 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మధ్య నడిచే 8 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మధ్య నడిచే రెండు సర్వీసులు ఉన్నాయి. రైల్వే ట్రాక్ పనులు పూర్తయిన తర్వాత అన్ని సర్వీసులను యధావిధిగా పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్యరైల్వే తెలిపింది.