Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు... హాజరుకానున్న 4.94 లక్షల మంది

Advertiesment
తెలంగాణాలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు... హాజరుకానున్న 4.94 లక్షల మంది
, సోమవారం, 3 ఏప్రియల్ 2023 (08:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 4.94 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 78 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం వారే కావడం గమనార్హం. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్షా హాలులోకి ఉదయం 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. అయితే, తొలి రోజున పరీక్షా కేంద్రంలోని ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. 
 
ఈ పరీక్షలకు హాజరవుతున్న మొత్తం విద్యార్థులు 4,94,620 మంది కాగా, వీరిలో రెగ్యులర్ విద్యార్థుల 4,85,826 మంది ఉన్నారు. 8,632 మంది ఒకసారి ఫెయిల్ అయినవారు ఉన్నారు. కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. 
 
మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లీష్ మీడియంకు చెందిన వారు కాగా, 98,726 మంది తెలుగు, 7,851 మంది ఉర్దూ, 235 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలవుతుంది.
 
కాగా, ఈ పరీక్షను సాధారణంగా 11 పేపర్లలో నిర్వహించాల్సి వుండగా ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లతో మాత్రమే నిర్వహిస్తారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో 8.30 గంటలకు నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. 
 
అదేసమయంలో ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఇక కాపీయింగ్ నిరోధానికి మొత్తం 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరంలో కండలు పెంచే డేంజర్ ఇంజెక్షన్...