Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం.. షెడ్యూల్ వివరాలివే

Advertiesment
exams
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి విద్యార్ధులు తమ హాల్ టికెట్లు పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఇప్పటికే వెల్లడించారు.

ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తం 5 లక్షల 8వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. విద్యార్థుల హల్ టిక్కెట్లు గురువారం వెబ్ సైట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కృష్ణారావు తెలిపారు. 
 
షెడ్యూల్‌ వివరాలు:
మే 23- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్ గ్రూప్-ఏ
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)
మే 24- సెకండ్ లాంగ్వేజ్..
మే 25- థర్డ్ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌)
మే 26- మ్యాథమెటిక్స్‌
మే 27- జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌)
మే 28- సోషల్‌ స్టడీస్‌
మే 30 – ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1 (సంస్కృతం, అరబిక్‌)
మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌)
జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ).

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధిక మార్కులు వేయిస్తానని విద్యార్థిని అక్కడ తాకిన అబ్జర్వర్