Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గురించి తెలుసుకుందామా?

Yashaswini Reddy

సెల్వి

, శుక్రవారం, 2 ఆగస్టు 2024 (16:32 IST)
Yashaswini Reddy
మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా వారసత్వం ఉంది. దీని ఆధారంగానే కొందరు కొడుకులు, కోడళ్లు రాజకీయంగానే కాకుండా సినిమా పరంగా కూడా రాణిస్తున్నారు. అలా తమ అత్తమామల రాజకీయ వారసత్వాన్ని వారసత్వంగా పొంది, సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తమ కోడళ్లు ఎందరో ఉన్నారు. 
 
అలాంటి వారిలో పాలకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన మామిడాల యశస్వినిరెడ్డి ఒకరు. తెలంగాణలో అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. అంతేకాదు 68 ఏళ్లు నిండిన ఎర్రబెల్లి దయాకర్ రావును మట్టి కరిపించారు. 
 
అలాంటి యశస్విని రెడ్డి రాజకీయ జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
 
మామిడాల యశస్విని రెడ్డి 1997లో హైదరాబాద్‌లో జన్మించారు. 2012లో ఎల్‌బీ నగర్‌లోని శ్రీ చైతన్య స్కూల్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. 2018లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆమె ఝాన్సీ రెడ్డి కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి సొంత కంపెనీలో మేనేజర్‌గా పనిచేసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చారు. 
 
అత్త ఝాన్సీరెడ్డి అమెరికాలో ఉంటూ తన సొంత భూమి అయిన పాలకుర్తిపై ఉన్న ప్రేమతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యే వారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో పాఠశాలలు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. 
 
సహాయం కోసం వచ్చిన వారెవరినీ తిరిగి పంపేవారు కాదు. ఈ క్రమంలో తొర్రూరు మండలంలో అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. అలా ఎక్కడో ఒకచోట ఉంటే అభివృద్ధి జరగదని గ్రహించి, అందుకు అన్ని సన్నాహాలు చేసుకున్న ఝాన్సీరెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు.
చివరకు ఆమె కాంగ్రెస్‌లో చేరి పాలకుర్తి నుంచి అసెంబ్లీ బరిలో నిలవాలనుకున్నారు. 
 
భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిర్ణీత సమయానికి పౌరసత్వం అందలేదు. దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డి బరిలోకి దిగారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని యశస్వినిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే అన్నీ నేర్చుకోగలిగారు. 
 
తనదైన శైలిలో సమస్యలను తెలుసుకుంటూ.. రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ ముందుకు సాగారు. పోటీ చేసిన రెండు మూడు నెలల్లోనే ప్రజలతో మమేకమైన యశస్విని రెడ్డి అద్భుతమైన మెజారిటీ సాధించి ఎర్రబెల్లి దయాకర్ రావుపై విజయం సాధించారు. తద్వారా ప్రస్తుత అసెంబ్లీలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా యశస్వినిరెడ్డి రికార్డు సృష్టించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై నెలలో శ్రీవారికి రూ.125.35 కోట్ల హుండీ ఆదాయం