Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

Advertiesment
cell phone

ఐవీఆర్

, సోమవారం, 24 నవంబరు 2025 (22:29 IST)
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) 2025 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియా (ఎల్‌ఎస్‌ఎ) పరిధిలో గల తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నగరం ప్రధాన మార్గాల్లో నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్(ఐడిటి) ఫలితాలను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ట్రాయ్ ప్రాంతీయ కార్యాలయం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ డ్రైవ్ టెస్టులను... నగర ప్రాంతాలు, విద్యాసంస్థల హాట్‌స్పాట్లు, గ్రామీణ నివాస ప్రాంతాలు వంటి వివిధ వినియోగ పరిస్థితుల్లో నిజ జీవిత మొబైల్ నెట్‌వర్క్ పనితీరును అంచనా వేయడానికి రూపొందించారు.
 
2025 అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 9 వరకు 355.0 కిలోమీటర్ల పరిధిలో సంగారెడ్డి సిటీ డ్రైవ్ టెస్ట్, 5 హాట్‌స్పాట్ ప్రాంతాల్లో వివరణాత్మక పరీక్షలను ట్రాయ్ బృందాలు నిర్వహించాయి. ఈ పరీక్షల్లో వివిధ మొబైల్ హ్యాండ్‌సెట్ సామర్థ్యాల ఆధారంగా వినియోగదారుల సేవా అనుభవాన్ని ప్రతిబింబించేలా 2G, 3G, 4G, మరియు 5G సాంకేతికతలను నిశితంగా పరీక్షించారు. ఈ ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (ఐడిటి) ఫలితాలు సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు(టిఎస్‌పీలు) తెలియజేశారు.
 
పరీక్షించిన ప్రధాన అంశాలు:
వాయిస్ సేవలు: కాల్ సెటప్ విజయవంతమైన శాతం (సిఎస్ఎస్ఆర్), కాల్ డ్రాప్ రేట్ (డిసిఆర్), కాల్ సెటప్ సమయం, కాల్ సైలెన్స్ రేట్, వాయిస్ నాణ్యత (ఎంఓఎస్), కవరేజ్.
 
డేటా సేవలు: డౌన్‌లోడ్ / అప్‌లోడ్ వేగం, లేటెన్సీ, జిట్టర్, ప్యాకెట్ డ్రాప్ రేట్, మరియు వీడియో స్ట్రీమింగ్‌లో జాప్యం.
 
కాల్ సెటప్ విజయవంతమైన శాతం: ఆటో-సెలెక్షన్ మోడ్ (5G/4G/3G/2G)లో-ఎయిర్‌టెల్: 100.00%, బీఎస్‌ఎన్‌ఎల్: 88.82%, ఆర్‌జెఐఎల్ (జియో): 100.00%,  వీఐఎల్ (వోడాఫోన్ ఐడియా): 89.16%
 
డ్రాప్ కాల్ రేట్ : ఆటో-సెలెక్షన్ మోడ్ (5G/4G/3G/2G) లో ఎయిర్‌టెల్: 0.00%, బీఎస్‌ఎన్‌ఎల్: 6.29%, ఆర్‌జెఐఎల్ (జియో): 0.00%, వీఐఎల్ (వోడాఫోన్ ఐడియా): 0.00%
 
సంగారెడ్డి నగరంతో పాటుగా గజ్వేల్, కుక్నూరుపల్లె, దుద్దెడ, సిద్దిపేట, రామాయంపేట, మాచవరం, పాపన్నపేట, ముస్లాపూర్, సాంగుపేట్, కండి, జహీరాబాద్, ఆరూర్, పటాన్‌చెరువు, నర్సాపూర్, తుంకి, కుల్చారం వంటి పరిసర ప్రాంతాల్లో కూడా పరీక్ష నిర్వహించారు. ట్రాయ్ వాస్తవ వినియోగ పరిస్థితులను కూడా క్రింది ప్రదేశాల్లో పరీక్షించింది: గజ్వేల్ బస్ స్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, నర్సాపూర్, మెదక్ బస్ స్టాండ్, సంగారెడ్డి బస్ స్టాండ్, సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం. ఈ పరీక్షలు ట్రాయ్ సూచించిన పరికరాలు, ప్రామాణిక ప్రోటోకాల్స్ ఉపయోగించి నిజ సమయంలో నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)