Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Advertiesment
komatireddy venkatreddy

ఠాగూర్

, సోమవారం, 23 డిశెంబరు 2024 (19:23 IST)
'పుష్ప-2' చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటరులో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇపుడు పెనువివాదానికి దారితీసింది. ఈ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయగా ఈ వ్యాఖ్యలను హీరో అల్లు అర్జున్ ఖండించారు. 
 
ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. ఐకాన్ స్టార్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటదా? అని ప్రశ్నించారు. ఐకాన్ స్టార్ అయితే ఎవరిని చంపినా ఫర్వలేదా? అని సూటిగా అడిగారు. ప్రధానమంత్రి అయినా సర్పంచ్ అయినా ఐకాన్ స్టార్ అయినా అందరికీ ఒకటే చట్టం అని అన్నారు. 
 
చిత్రపరిశ్రమకు చెందిన హీరోల్లో అనేక మంది స్మార్ట్‌గా తయారైన అల్లు అర్జున్‌ను పరామర్శించారు కానీ ఆసుపత్రికి మాత్రం రాలేదన్నారు. జింకను చంపిన కేసులో ఇంటర్నేషనల్ స్టార్ సల్మాన్ ఖానే 14 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. విలేకరుల సమావేశం పెట్టి తనను, సీఎంను అలా అనడం కరెక్ట్ కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)