ఇటీవల ఓ పత్రికలో ఒక వార్త చూశానని, జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని, ఆ లెక్కన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా వెంటనే ముఖ్యమంత్రి పదవి వరించదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎందుకంటే కేటీఆర్ కంటే ఆయన సోదరి కవిత జైలుకు వెళ్ళారని, అందువల్ల ముందు కవిత సీఎం ఛాన్స్ రావాలన్నారు.
ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం అదానీ సంకలో దూరిందని విమర్శించారు. కానీ, ఇపుడు వారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి పలు ప్రాజెక్టులు కట్టబెట్టారన్నారు. వాటిపై విచారణకు సిద్ధమా సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నించారు. పైగా, కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు.
ఆ మధ్య ఓ పేపర్‌లో చూశాను.. జైలుకు వెళ్లి వారంతా (సీఎం) అయ్యారని భావిస్తున్నారు. ఆ లెక్కన మొదటి వారి (కేటీఆర్) చెల్లెలు కవిత జైలుకు వెళ్లారు. అలా కూడా కేటీఆర్‌కు అవకాశం రాదు. అలాంటి అవకాశం ఏదైనా వుంటే ఇప్పటికే ఆ ఛాన్స్ ఆయన చెల్లెల్లు కొట్టేసింది. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం పదవికి కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు. ఆ ఫ్యామిలీలో పోటీని తట్టుకోలేక మాపై ఏడుపు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసిన కేటీఆర్... ఆలోచన చేసే ముందు కాస్త ముందూవెనుక చూసుకుని మాట్లాడాలని సూచించారు.